![]() |
![]() |

ఈటీవీలో త్వరలో ఒక కొత్త షో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. అది కూడా స్టూడెంట్స్ స్పెషల్ గా డిజైన్ చేసిన షో ఇది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి హోస్ట్స్ గా రవి, వర్ష ఉండబోతున్నారనే విషయం తెలుస్తోంది. "తగ్గేదేలే" అంటూ ఈ షోకి పేరు పెట్టారు. ఇక ఆగష్టు 4 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 5 .30 కి ఇది ప్రసారం కాబోతోంది. "వీళ్ళ పంచుల్లో ఒక క్లారిటీ ఉంటుంది" అంటూ రవి చెప్పడంతో "ఏంటి రవి గ్యాప్ వచ్చింది గాలి తిరుగుడా" అంటూ ఒక స్టూడెంట్ ఘాటుగా ఒక డైలాగ్ వేసింది. "వీళ్ళ డైలాగుల్లో ఒక దమ్ము ఉంటుంది" అనేసరికి "సామి పీలింగ్స్ వచ్చేస్తున్నాయి" అంటూ ఇంకో స్టూడెంట్ అనేసింది.
"స్టూడెంట్ టాలెంట్ ని ఫుల్ వాల్యూమ్ లో వినిపిస్తాం" అంటూ కొన్ని టాస్కులు ఇచ్చి ఆడించాడు. "వీళ్ళ సాంగ్స్ లో ఒక స్వాగ్ ఉంటుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉంటుంది..అసలు సిసలైన సెలబ్రిటీ షో" అన్నాడు. తర్వాత వర్షా వచ్చి "దగ్గర నుంచి భయమేసిందమ్మా" అనేసరికి "మిమ్మల్ని చూస్తే భయమేసింది అక్క" అంటూ ఒక స్టూడెంట్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది వర్షకి. "మా స్టూడెంట్స్ మా సెలబ్రిటీస్ తగ్గేదేలే" అంటూ చెప్పాడు రవి. ఇంతకు ముందు కూడా ఎన్నో షోస్ ఇలా స్టూడెంట్స్ ఆధర్యంలో అలాగే మహిళలకు కూడా నిర్వహించారు. కానీ ఇప్పుడు ఈ షోని స్టూడెంట్స్ కోసమే సరికొత్తగా తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది.
![]() |
![]() |